HomeTelugu TrendingSreeleela: శ్రీలీల ప్లేస్‌లో కొత్త హీరోయిన్.. తెలుగులో వరుస ఆఫర్లు!

Sreeleela: శ్రీలీల ప్లేస్‌లో కొత్త హీరోయిన్.. తెలుగులో వరుస ఆఫర్లు!

Sreeleela 1 Sreeleela,Malayalam,Premalu,Tollywood,Mamitha Baiju,Vijay Deverakonda

Sreeleela: టాలీవుడ్‌లో అతి తక్కువ మోస్ట్‌ వాటెండ్‌ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల. వరుసగా స్టార్‌ హీరోలకు జంటగా నటించింది. అయితే వరుస ఫ్లాప్‌లతో ఈ బ్యూటీ క్రేజ్‌ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడికి సినిమాలు లేవు. దీంతో పలువురు కొత్త హీరోయిన్లు శ్రీలీల ప్లేస్‌ను రీప్లేస్‌ చేసేందుకు పోటీ పడుతున్నారు. వీరిలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు కూడా ఉంది.

ఇటీవలే వచ్చిన మలయాళం మూవీ ‘ప్రేమలు’ ఎంతటి హిట్‌ కొట్టిందో తెలిసిందే. తెలుగు వెర్షన్​లోనూ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. టాప్ ట్రెండింగ్​లో దూసుకుపోతోంది. సోషల్ మీడియా అంతా ప్రేమలు హ్యాష్​ట్యాగే నడుస్తోంది.

మరీ ముఖ్యంగా ఈసినిమాలో హీరోయిన్​గా నటించిన మమితా బైజు పేరు గట్టిగా వినిపిస్తుంది. సోషల్‌ మీడియాలో ఈమె ఫొటోలు, వీడియోలే చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఇప్పటికే సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్​తో కలిసి ఆమె ​నటించిన రెబల్ కూడా మంచి ట్రెండింగ్ అవుతోంది.

Sreeleela New heroine in he Sreeleela,Malayalam,Premalu,Tollywood,Mamitha Baiju,Vijay Deverakonda

దీంతో ఇప్పటికే మమితాకు వచ్చిన క్రేజ్​తో సౌత్ నిర్మాతలు కూడా ఆమెపై కర్చీఫ్ వేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అయితే ఈమెకు ఇది తొలి సినిమా కాదు. 2017 నుంచి సినిమాల్లో నటిస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు 18కి పైగా సినిమాల్లో నటించేసింది.

2023లో ప్రణయ విలాసం, 2022లో సూపర్ శరణ్య, అంతకంటే ముందు 2021లో ఆపరేషన్ జావా, ఖోఖో సినిమాల్లోనూ కనిపించింది. అయితే ప్రేమలు సినిమానే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే మన తెలుగు నిర్మాతలు ఒక అడుగు ముందే ఉంటారు.

దీంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ్ నటించబోయే తర్వాతి సినిమాకు మమితాను ఒప్పించేశారంటూ కొద్ది రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా మరో రెండు మూడు సినిమా ఆఫర్లు లైన్‌లో ఉన్నట్లు టాక్‌. మరి గ్లామర్ పాత్రలకు, స్కిన్ షోకు దూరంగా ఉండే మమితా బైజు ఈ ఫేమ్‌ను ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu