HomeTelugu Trendingప్రభాస్‌కు జంటగా శ్రీలీల!

ప్రభాస్‌కు జంటగా శ్రీలీల!

Sreeleela in talks for a massive biggie
టాలీవుడ్‌లో ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. ఆతరువాత పలు సినిమాల్లో నటించి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాటెండ్‌ హీరోయిన్‌గా ఉంది. యంగ్‌ హీరోల నుండి స్టార్‌ హీరోల వరకూ అందరితో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. పోతినేని రామ్‌ సరసన నటించిన స్కంద చిత్రం ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఆమెకు మరో భారీ ఆఫర్ వచ్చింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్‌ హను రాఘవపూడి రెబల్ స్టార్ ప్రభాస్‌కు కథ వినిపించాడని, అది ప్రభాస్‌కు నచ్చిందని టాలీవుడ్‌ సర్కిల్‌లో టాక్‌ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్ట్‌ ను నిర్మించే అవకాశం ఉంది. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ ఆఫర్ శ్రీలీల చేతికి వస్తే ఆమె కెరీర్‌‌ మరో మెట్టుకు ఎక్కనుంది. ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu