HomeTelugu Big Stories'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి' లిరికల్‌ సాంగ్‌ విడుదల

‘చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

Srivalli From Pushpa
సుకుమార్- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే..’ ప్రోమో మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తి లిరికల్‌ సాంగ్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం.

కాగా తాజాగా రిలీజ్‌ అయిన ఈ సాంగ్‌ ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి…మాటే మాణిక్యమాయనే శ్రీవల్లి…చూపే బంగారమాయనే శ్రీవల్లి… నవ్వే నవరత్నమాయనే’ అనే పల్లవితో సాగి సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. పల్లెటూరి యువకుడిగా అల్లు అర్జున్‌ సాంగ్‌లో ఆకట్టుకున్నాడు. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్‌ 17న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu