HomeTelugu Trendingఈ సారి భయపెడతా: సుధీర్‌

ఈ సారి భయపెడతా: సుధీర్‌

Sudhir Sudheers new movieసుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. ఈ సినిమాతో ‘డోలీషా’ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. డిసెంబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

తాజా ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ .. “ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ … మంచి లవ్ స్టోరీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. కొంచెం ఫన్ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు భయపెడతాయి కూడా. ఈ సినిమాలో నా పాత్ర కామెడీ చేయదు. సీరియస్ గానే సాగుతుంది. అందువలన నేను కొత్తగా అనిపిస్తాను” అని అన్నాడు.

“ఈ సారి నేను చేసే ప్రయోగంగానే ఈ సినిమాను భావిస్తాను. తప్పకుండా నన్ను ఈ తరహా పాత్రలలో ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది” అన్నాడు. ఇక హీరోయిన్ డోలీషా మాట్లాడుతూ, సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి విన్నాను. ఆ తరువాత ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను. ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది” అని చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu