HomeTelugu Trendingసుడిగాలి సుధీర్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్‌

సుడిగాలి సుధీర్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్‌

Sudigali sudheer engagement
బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కి మంచి ఫాలోయింగ్‌ ఉంది. కామెడీ షోలు చేస్తూనే ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడీ కమెడియన్‌. తనకు వచ్చిన గుర్తింపు, ఆదరణతో సినిమాల్లోనూ లక్‌ పరీక్షించుకోవాలనుకున్నాడు.

ఇదిలా ఉంటే ఇటీవలే సుధీర్‌కి ఎంగేజ్‌మెంట్‌ జరిగిందంటూ తాజాగా ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిజంగానే ఓ కామెడీ షోలో సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్‌ జరిపించారు. దీంతో అయోమయానికి లోనైన కొందరు అభిమానులు సుధీర్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడా? అని చర్చలు మొదలు పెట్టారు.

Sudigali sudheer 1

గతంలో సుధీర్‌కు నిశ్చితార్థమేంటి? ఏకంగా పెళ్లి కూడా చేశారు. కాకపోతే అదంతా స్కిట్‌లో భాగంగానే! దీంతో ఈ ఎంగేజ్‌మెంట్‌ కూడా కచ్చితంగా ప్రాంక్‌ అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు మెజారిటీ నెటిజన్లు. ఇలా చాలాసార్లు మోసపోయాం, కానీ ఈసారి ఆ ఛాన్స్‌ మీకు ఇవ్వమని తేల్చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం.. ‘ఆ అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిలా కనిపిస్తోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది!

మరో వివాదంలో మంచు మోహన్ బాబు

Recent Articles English

Gallery

Recent Articles Telugu