HomeTelugu Trendingమళ్ళీ 'పుష్ప' షూటింగ్‌ మొదలెట్టిన సుకుమార్‌

మళ్ళీ ‘పుష్ప’ షూటింగ్‌ మొదలెట్టిన సుకుమార్‌

Sukumar re started pushpa s

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఓ నెలరోజుల పాటు చిత్రీకరణ జరిపితే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంటుంది. హైదరాబాద్ .. మారేడుమిల్లి ప్రాంతాల్లో షూటింగును ప్లాన్ చేశారు. అయితే హైదారాబాదులో షూటింగు జరుగుతూ ఉండగానే ఆపేశారు. వర్షాల కారణంగా సెట్ దెబ్బతినడం వలన అనీ, సుకుమార్ కి ఫీవర్ వచ్చిందని చెప్పుకున్నారు. సుకుమార్ కి ఫీవర్ రావడం నిజమేనట. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆయన, ఈ రోజున షూటింగును మొదలుపెట్టేసినట్టుగా చెబుతున్నారు. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.

త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఫాహద్ ఫాజిల్ జాయిన్ కానున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. అడవి నేపథ్యంలో .. అనూహ్యమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu