HomeTelugu Trendingసుమంత్‌ కొత్త సినిమా ప్రారంభం

సుమంత్‌ కొత్త సినిమా ప్రారంభం

5 1

కన్నడలో విజయవంతమైన కావలూడారిని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. సుమంత్‌ హీరోగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను నిన్న చెన్నైలో స్టార్ట్ చేశారు. క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై డా.జి.ధనంజయన్ ఈ సినిమాని రెండు భాషల్లో నిర్మిస్తున్నారు. సుమంత్, నందిత, పూజాకుమార్, నాజర్, జయప్రకాశ్, సంపత్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా తమిళ వెర్షన్‌లో వేరే నటీనటులతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ మధ్య ‘కిల్లర్’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్న సైమన్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. విజయ్ ఆంటోనితో భేతాళుడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే తెలుగులో విజయవంతమైన క్షణం చిత్రాన్ని తమిళంలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్‌తో సత్య అనే పేరుతో తెరకెక్కించి తమిళంలోనూ సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు ప్రదీప్ కృష్ణమూర్తి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu