HomeTelugu Big Storiesహనుమాన్‌: సూపర్‌ హీరో సాంగ్‌ విడుదల

హనుమాన్‌: సూపర్‌ హీరో సాంగ్‌ విడుదల

SuperHero HanuMan song From

యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతు వచ్చింది. ఇప్పడు సంక్రాంతిని టార్గెట్ చేసి విడుదలకు సిద్ధమవుతోంది. పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ పొంగల్ బరిలో ఏ మాత్రం వెనుకడుగు వేయకూడదు అని అనుకుంటుంది. ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు.

ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో కూడా అంచనాలు పెంచేశారు. అయితే ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసే విధంగా అప్డేట్స్ అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక సినిమాలోని ఒక ప్రత్యేకమైన పాటను కూడా విడుదల చేశారు. నేడు చిల్డ్రన్స్ డే సందర్భంగా సూపర్ హీరో తరహాలో హనుమాన్ ను ప్రజెంట్ చేస్తూ మర్వెల్ హీరోలకు ధీటుగా ఉండే హనుమాన్ అంతకంటే గొప్పవాడు అన్నట్లు హైలెట్ చేశారు.

పిల్లలను టార్గెట్ చేసి విధంగా ఈ పాటను కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు హనుమాన్ చాలీసా పాకు మంచి స్పందనకు వచ్చాయి. ఇక సూపర్ హీరో హనుమాన్ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అనుదీప్ దేవ్ స్వరపరిచిన ఈ పాటను వాగ్దేవి, ప్రకృతి, మయుక్ అద్భుతంగా పాడారు. కృష్ణకాంత్ రాసిన సాహిత్యం కూడా బావుంది. విజువల్స్‌తో పాటు హాస్య కథనం పిల్లలను ఎక్కువగా ఆకట్టుకునేలా ఉంది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హనుమాన్ 2024 జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ రేంజ్ లో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu