HomeTelugu Trendingసురేష్ బాబు 'రాజమండ్రి రోజ్ మిల్క్' ప్రీలుక్‌

సురేష్ బాబు ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ ప్రీలుక్‌

Suresh Babu new movie Rajah

టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సురేష్‌ బాబు.. పెద్ద సినిమాలు కాకుండా మీడియం రేంజ్ సినిమాలు.. చిన్న సినిమాలు.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు మాత్రమే వస్తున్నాయి. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ నుండి మరో చిన్న సినిమా రాబోతుంది. అదే ‘రాజమండ్రి రోజ్ మిల్క్’. ఈ సినిమా ప్రదీప్ ఉప్పలపాటితో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా ఒక ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ప్రీ లుక్ తోనే సినిమాపై ఆసక్తి కలిగించారు.

కాలేజ్ లేదా స్కూల్ ఏజ్ లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా ప్రీ ఏజ్ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ సినిమాలో నటినటులు కొత్త వారే అన్నట్లుగా సమాచారం అందుతోంది. సురేష్ బాబు బ్యానర్ లో ఇప్పటికే నాలుగు అయిదు చిన్న.. మీడియం రేంజ్ సినిమాలు రూపొందుతున్నాయి. ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా జాయిన్ అయ్యింది. లవ్ స్టోరీలకు ఎప్పుడు కూడా మంచి ఆధరణ ఉంటుంది. కనుక ఈ సినిమా తో సురేష్ బాబు మరో చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu