HomeTelugu Trendingభీమవరం 'సైరా' పోస్టర్స్.. మెగా అభిమానులపై ఉపాసన ట్వీట్‌

భీమవరం ‘సైరా’ పోస్టర్స్.. మెగా అభిమానులపై ఉపాసన ట్వీట్‌

2 1భీమవరం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌పై ప్రత్యేకంగా ట్వీట్ చేశారు ఉపాసన కొణిదెల. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన… తన మామయ్య ‘సైరా’ సినిమా విడుదల సందర్బంగా కూడా కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ‘సైరా’ సినిమా విడుదలను చిరు అభిమానులు ఓ పండగలా చేసుకుంటున్నారు. భీమవరంలో సైరా సినిమా కోసం పెద్ద పోస్టర్ ఏర్పాటు చేశారు. 250 అడుగుల పొడవైన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు అరకిలోమీటలర్ వరకు చిరంజీవి అభిమానులు సైరా కోసం అభిమానులు బ్యానర్ కట్టారు. అయితే ఈ బ్యానర్‌ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో ట్వీట్ చేస్తూ… భీమవరం అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఉపాసన.

గతంలో బాహుబలి సినిమా విషయంలో దాదాపు అర కిలోమీటర్ వరకు సాహో బ్యానర్స్‌ కట్టి ఔరా అనిపించారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు అదే భీమవరంలో చిరంజీవి అభిమానులు కూడా అచ్చం ఇలాంటి పోస్టర్ ఒకటి పెట్టారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu