HomeTelugu Trendingజమునగా మిల్కీబ్యూటీ తమన్నా!

జమునగా మిల్కీబ్యూటీ తమన్నా!

Tamanna Jamuna biopic

ప్రముఖ నటి జమున జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నారు. దర్శకుడు శివనాగు నర్రా దీనికోసం స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఇందులో జమున పాత్ర కోసం తమన్నాను సంప్రదించారట. తెలుగు సినిమాలో సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి అగ్ర నాయకుల సరసన నటించిన జమున అలనాటి అందాల తార. ఈ గొప్ప నటి జీవిత కథను తెరకెక్కించబోతున్నారు. జమున తన 16వ ఏట తెరంగేట్రం చేశారు. తన అద్భుత నటనతో పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే జమున పాత్రలో నటించేందుకు తమన్నా ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదట. ఇప్పటికే సావిత్రి బయోపిక్‌ మహానటిలో కీర్తి సురేష్ శభాష్ అనిపించుకుంది. మరి తమన్నా ఏం చేస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu