HomeTelugu Trendingతమన్నా కాదు.. సైరా లక్ష్మి

తమన్నా కాదు.. సైరా లక్ష్మి

7 2‘సైరా’ చిత్రంలో మెగాస్టార్ కు సపోర్టింగ్ రోల్‌ చేసిన హీరోయిన్ తమన్నా. తన నటనతో ఆకట్టుకుంది. సైరా సినిమా గురించి చెప్పినపుడు తప్పనిసరిగా తమన్నా గురించి, లక్ష్మి పాత్ర గురించి కూడా చెప్పాలి. సైరా ప్రియురాలిగా, స్వాతంత్ర సమరంలో స్ఫూర్తిని నింపే యువతిగా తమన్నా అద్భుతంగా నటించి మెప్పించింది. నటనకు స్కోప్ ఉండే పాత్ర దొరికితే అందులో ఎలా మెప్పించవచ్చో ఆమె చేసి చూపించింది.

మెగాస్టార్ కూడా ప్రత్యేకంగా ఆమెను మెచ్చుకున్నారు. అలానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఇకపై తమన్నాను తమన్నా అనే పేరుతో కాకుండా సైరా లక్ష్మి పేరుతో పిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సినిమాలో మంచి నటనను కనబరచడంతో..ఆమెకు అనేక ఆఫర్లు వస్తాయనడంలో సందేహం అవసరం లేదు. దక్షిణాది భాషలతో పాటు అటు బాలీవుడ్‌లోను తమన్నా బిజీ అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu