HomeTelugu Trendingతమన్నా డ్యాన్స్‌ మీడియో వైరల్

తమన్నా డ్యాన్స్‌ మీడియో వైరల్

Tamannaah dance video viral

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మూవీ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లైపోతుంది. ఇప్పటికి ఈ బ్యూటీ గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది. నటనతో పాటు తమన్నాకు డ్యాన్స్‌లోనూ మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే సినిమాలో స్పెషల్‌ సాంగ్స్‌లోనూ దుమ్మురేపుతోంది. కేవలం ఒక్క పాట కోసం కూడా భారీగానే పారితోషికం తీసుకుంటుంది తమన్నా.

తమన్నాకు సోషల్‌ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. తన మూవీస్‌, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే మన అవంతిక(బాహుబలిలో తమన్నా పాత్ర పేరు) తాజాగా ఓ ఫుల్‌ బీట్‌తో కూడిన డ్యాన్స్‌ను షేర్‌ చేసింది. చురకైన డ్యాన్స్ స్టెప్పులతో వావ్‌ అనేలా చేసింది. డోజా కాట్, ఓ బాయ్ కలసి పాడిన ‘కిస్ మీ మోర్’ అనే పాటకు కొరియోగ్రాఫర్ షజియా సమ్జీతో కలసి హుషారైన స్టెప్పులు వేసింది. తమన్నా చేసిన ఈ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Recent Articles English

Gallery

Recent Articles Telugu