HomeTelugu Trendingప్రభాస్ '20వ' సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇతనేనా?

ప్రభాస్ ’20వ’ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇతనేనా?

6a 6

యంగ్‌ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు రాధే శ్యామ్, ఓ డియర్ అనే టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది అసలైన టైటిల్ అనేది త్వరలోనే ప్రకటించనున్నారు. ఏడాదిన్నర నుండి ఈ సినిమా ప్రొడక్షన్ లో ఉంది. జార్జియాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న నేపధ్యంలో కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్‌ను మధ్యలోనే ఆపేసి ఇండియా తిరిగి వచ్చిన విషయం తెల్సిందే.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు అనేది వైరల్‌గా మారింది. మొదటిగా అమిత్ త్రివేది అని పుకార్లు వచ్చాయి.. ఆ తర్వాత రకరకాల పేర్లు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం యువ తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతం అదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆయన ఇప్పటికే తెలుగులో డియర్ కామ్రేడ్ చిత్రానికి పనిచేశాడు. మెలోడీలు అందించడంలో జస్టిన్ ప్రభాకరన్‌ స్టైలే వేరు. ఈ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీ అయిన రాధే శ్యామ్ కు జస్టిన్ అయితే న్యాయం చేస్తాడని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే జస్టిన్ ప్రభాకరన్ ట్యూన్స్ కు సంబంధించిన వర్క్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో అధికారికంగా ప్రకటించే వరుకు చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu