తనికెళ్ల భరణి ‘అద్భుతః’!


రచయిత, కవి, వక్త, నటుడు, దర్శకుడిగా తనికెళ్ల భరణికి మంచి పేరు వుంది. ఎన్నో విభిన్నమైన .. విలక్షమైన పాత్రలకి జీవం పోసిన తనికెళ్ల భరణి, ఆ తరువాత తన అభిరుచికి తగిన సినిమాలను రూపొందించడానికి మెగాఫోన్ పట్టారు. ‘సిరా’.. ‘మిథునం’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.

తాను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా తక్కువ పాత్రలతో సందేశాత్మకంగా చెప్పడం తనికెళ్ల భరణి ప్రత్యేకత. ఇదే తరహాలో ఆయన మరో కథను సెట్స్ పైకి తీసుకెళ్లి చిత్రీకరణను పూర్తి చేశారు .. ఈ సినిమా పేరే ‘అద్భుతః’. వినోదం .. సందేశం కలగలిసిన ఈ కథను ఓ ప్రయోగాత్మక చిత్రంగా ఆయన తీర్చిదిద్దారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాను, త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో వున్నారు.