దేశంలో సమస్యలు అన్నీ వదిలి.. నా జాతకం మీద పడ్డవేంటి?: కేసీఆర్‌

తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందిచారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు.. గోదావరిఖని నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… దేశంలో ఎన్నో సమస్యలుంటే అవన్ని వదిలేసి కేసీఆర్ జాతకాలు చూపించుకుంటాడు.. సంకలో గొక్కుంటాడని ప్రధాని మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. ఐదేళ్ల మోడీ పాలనలో ఒక్క పనైందా…? అని ప్రశ్నించిన కేసీఆర్.. అసెంబ్లీలో తీర్మానం చేసి నేను మోడీ చెప్పిన సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మాఫీ చేయాలని ఇప్పటికి చేయలేదని మండిపడ్డారు. మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్ పాలించినప్పటికీ దేశం ఏవిధంగా అభివృద్ధి చెందలేదన్న తెలంగాణ సీఎం… దేశంలో 13.5 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. దానిని ఎలా వినియోగించుకోవాలో వారికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీలేనని స్పష్టం చేశారు. చిన్న ఇండోనేషియా లాంటి దేశంలో 4 శాతం ఆదాయపు పన్ను వసూలు చేస్తే 24 లక్షల కోట్ల రూపాయలు వసూలు అయితే.. అలాంటిది మనదేశంలో 30 శాతం ఆదాయపు పన్ను వసూలు చేస్తే ఎన్ని లక్షల కోట్లు రావాలి, అవి ఏమైనవి? అని ప్రశ్నించారు కేసీఆర్.

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. తుమ్మిడిహాట్టి బ్యారేజి పూర్తి చేసి 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం. ఈ మధ్యే నేను మహారాష్ర్టతో మాట్లాడాన్న ఆయన.. రామగుండంలో ఎమ్మెల్యే చందర్ కోరిక మేరకు మెడికల్ కాలేజి తప్పకుండా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఖాయమని తెలిపిన ఆయన.. మంచిర్యాల, క్యాతనపల్లి, నస్పూర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. జూన్, జులైలో కొత్త రెవెన్యూ చట్టం ఏర్పాటు చేస్తామని… రానున్న రోజుల్లో 1 కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అవినీతి పాలన విధానాన్ని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రశంసిస్తున్నారని గుర్తుచేశారు కేసీఆర్.

CLICK HERE!! For the aha Latest Updates