తెలుగు టీవీ సీరియల్ నటి అదృశ్యం


టీవీ సీరియల్ నటి కనిపించకపోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ హాస్టల్‌లో ఉంటున్న లలిత ఆకస్మికంగా కనపించకుండా పోయింది. ఎస్సార్ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లలితను తీసుకెళ్లినట్టు ఆమె స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. లలిత స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం. లలిత ఏడాదిగా పలు తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగు చానెళ్లలో ప్రసారమయ్యే ప్రేమ, కల్యాణ వైభోగం, స్వర్ణ ఖడ్గం అనే సీరియల్స్‌లో నటిస్తోంది.