HomeTelugu Trendingబాలీవుడ్‌లోకి తెలుగు 'వినాయకుడు'..

బాలీవుడ్‌లోకి తెలుగు ‘వినాయకుడు’..

Telugu vinayakudu in bollyw 1

బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. తెలుగులో విజయం సాధించిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డిని అక్కడ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. జెర్సీ , హిట్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు హిందీలో రీమేక్ కు సిద్ధమయ్యాయి. ఎప్పుడో వచ్చిన మహేష్ దూకుడు, అనుష్క అరుంధతి సినిమాలు కూడా రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా మరో తెలుగు సినిమాను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 12 ఏళ్ళ క్రితం కృష్ణుడు హీరోగా పరిచయమైన ‘వినాయకుడు’ సినిమాను హిందీ లో రీమేక్ చేయబోతున్నారట. వినాయకుడు సినిమాలో హీరోయిన్ గా సోనియా నటించింది. సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో వచ్చిన వినాయకుడు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంది. తెలుగులో దర్శకత్వం వహించిన సాయి కిరణ్ హిందీలో కూడా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu