HomeTelugu News'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌' గా సందీప్‌ కిషన్‌

‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’ గా సందీప్‌ కిషన్‌

యంగ్ హీరో సందీప్ కిషన్ హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు‌. ఈ శుక్రవారం తమన్నా జోడిగా నెక్ట్స్‌ ఏంటి.? సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న సందీప్‌ కిషన్‌ మరో ఇంట్రస్టింగ్‌ సినిమాను ప్రకటించాడు. కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.

10 3

నాగేశ్వర రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(మంగళవారం) ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’ సినిమాను ప్రకటించారు. అవుట్ అండ్‌ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హన్సిక హీరోయిన్‌గా నటించనుంది. ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ఈ సినిమా తెరకెక్కుతున్నారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 14న సెట్ మీదకు వెళ్లనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu