HomeTelugu Trendingసీతారామ‌మ్: స్టైలిష్‌ లుక్‌లో డైరెక్టర్‌ త‌రుణ్ భాస్క‌ర్

సీతారామ‌మ్: స్టైలిష్‌ లుక్‌లో డైరెక్టర్‌ త‌రుణ్ భాస్క‌ర్

Tharun bhaskar stylish look
మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సీతారామ‌మ్’. పీరియాడిక్ ల‌వ్‌స్టోరీతో వార్ బ్యాక్ డ్రాప్‌లో హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా… ర‌ష్మిక మంద‌న్నా కీ రోల్ చేస్తోంది. పెళ్లి చూపులు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

ఇప్ప‌టికే మేక‌ర్స్ ర‌ష్మిక, సుమంత్ ఫ‌స్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేయ‌గా.. ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా త‌రుణ్ భాస్క‌ర్ లుక్ కూడా రిలీజ్ చేశారు. త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రంలో బాలాజీ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో తరుణ్‌ భాస్కర్‌ స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆగ‌స్టు 5న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న ద‌త్ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu