HomeTelugu Trending'ది మాన్షన్ హౌస్' కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదల

‘ది మాన్షన్ హౌస్’ కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదల

Manseon house concept poste

వైవిధ్యభరితమైన కథలో తాజాగా తెరకెక్కుతున్న హారర్‌ మూవీ ‘ది మాన్షన్ హౌస్’. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు చిత్రబృందం‌. మహా శివరాత్రి కానుకగా మంగళవారం ‘ది మాన్షన్ హౌస్’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. కేవలం బ్లాక్ అండ్ వైట్ కలర్స్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాలో ఏదో కొత్త పాయింట్ చూపించబోతున్నట్లు స్పష్టం చేస్తోంది. పెద్ద బంగ్లా, ఆ బంగ్లా మీద ఒక లేడీ, ఆకాశంలో ఎగురుతున్నట్లుగా మనుషుల రూపాలు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తలారి వీరాంజనేయ సమర్పణలో శ్రీ హనుమాన్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ కార్తిక్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘ది మాన్షన్ హౌస్’ సినిమాకు బీసీవీ సత్య రాఘవేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సుశీల్ మెహర్, యష్ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. వృందా కృష్ణ ఫీమేల్ లీడ్‌లో కనిపించనున్నారు. కమల్ తేజ నార్ల, షారుఖ్, రాజీవ్ సిద్దార్థ్, రాజ్ రాయల్, శ్రవణ్ భరత్, శామీర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu