ఆ హత్యలకు కారణం జగన్ రెడ్డే

నాయకుడు ఎంత గొప్పవాడైనా ప్రజలంతా అతన్ని గుడ్డిగా నమ్మినా సరే.. నియంతృత్వ పోకడలు చేపడితే ఆ నాయకుడు కాలగర్భంలో చాలా వేగంగా కలిసిపోతాడు. ఇది చరిత్ర అనేకసార్లు నిరూపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ నిరూపించడానికి సన్నద్ధంగా ఉంది. అందుకే, జీఓ – 01 లాంటి బ్రిటిష్ చట్టాలను జగన్ రెడ్డి తీసుకువస్తున్నాడు. అసలెందుకు ? ఈ జీఓ నెంబర్ 1 ?, కేవలం జగన్ రెడ్డి మోసాలను, జగన్ రెడ్డి ప్రభుత్వ డొల్లతనాన్ని కప్పిపుచ్చేందుకేనా ?, పేద ప్రజలకు సంక్షేమం పేరుతో జగన్ రెడ్డి చేస్తున్న మోసాల గురించి ఎన్ని విధాలుగా చెప్పినా కలం దాహం తీరదు.

ఒక్క మాటలో జగన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ మోసకారి పథకాలే. చేపలకు ఏర వేసినట్టు.. జగన్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలను ఏర వేస్తున్నాడు. అయినా, జగన్ రెడ్డి పై ప్రజలకు నమ్మకం పోయింది. అందుకే, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత బయటపడుతున్నాయనే అక్కసుతో, కక్షపూరితంగా జీఓఆర్టీ-01ను తీసుకొచ్చాడు. అయినా, జగన్ రెడ్డి జీవో వ్యతిరేకతను ఆపలేదు కదా. అసలు జగన్ రెడ్డి సీఎం గా ఏం గొప్పగా చేశాడు ?, తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 19 లక్షల పెన్షన్లను పెంచితే, జగన్ రెడ్డి ఈ 3.7 సంవత్సరాల కాలంలో కేవలం 10 లక్షల పెన్షన్లే పెంచాడు.

తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ లు, వైసీపీ బడ్జెట్లను పోలిస్తే జగన్ రెడ్డి ఇప్పటికి 38 లక్షల పెన్షన్లు పెంచాల్సి ఉంది. కానీ, 10 లక్షలకే పరిమితం చేసి తానేంటో పేదలను ఉద్ధరించే వాడిలా రాజమండ్రిలో సభలు, రోడ్ షోలు పెట్టి కలరింగ్ ఇస్తున్నాడు. జగన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలకు పూర్తిగా ద్రోహం చేస్తూనే ఉంది. ఈ ద్రోహాలను చంద్రబాబు తన రోడ్ షో లు, బహిరంగ సభల్లో బయటపెడుతున్నారని జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. ఏదో ఒక విధంగా చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభలు, జనవరి-27న లోకేష్ పాదయాత్రలను ఆపాలనే దురుద్దేశంతో కందుకూరు, గుంటూరు ఘటనలను ఆధారంగా చేసుకుని జీఓఆర్టీ-01ను తెచ్చాడు.

ఈ జీఓను తీసుకురావడానికి జగన్ సర్కార్ 11 మంది పేదవాళ్లను కుట్రపూరితంగా హత్యచేసి ఆ నెపాన్ని చంద్రబాబుకు ఆపాదిస్తూ దుష్ప్రచారం చేస్తోంది. జీఓఆర్టీ-01 తీసుకురావడంతో కందుకూరు ఘటనలో వైసీపీ కుట్రకోణం ఉందని ఇప్పటికే అనేక అనుమానాలున్నాయి. వైసీపీ వాళ్లే ఉద్దేశపూర్వకంగా అలజడి, తోపులాట సృష్టించారని అనుమానాలున్నాయి. దీనిపై సీబీఐ తో లోతుగా విచారణ చేయించే దమ్ము జగన్ల రెడ్డికి ఉందా ?, అసలు జగన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేకి.. కాదు కాదు, జగన్ రెడ్డిది రాక్షస జాతి.

CLICK HERE!! For the aha Latest Updates