లోకేశ్‌ పోటీ మంగళగిరి నుంచి.. క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్నవేళ అభ్యర్థుల జాబితాపై రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్ధంచేసినప్పటికీ.. పెండింగ్‌ స్థానాలపై సీఎం చంద్రబాబు రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈసారి మంత్రి లోకేశ్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించడంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు.. లోకేశ్‌ పోటీపై స్పష్టత ఇచ్చారు. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి లోకేశ్‌ పోటీ చేస్తారని పార్టీ అధినేత ప్రకటించారు. తొలుత భీమిలి, విశాఖ నార్త్‌ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటి నుంచి ఆయన బరిలో దిగుతారని ప్రచారం జరిగినప్పటికీ చంద్రబాబు మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేశ్‌ పోటీ చేస్తారని ప్రకటించారు.