Homeతెలుగు వెర్షన్ఇది నందమూరి కుటుంబం నిజాయితీ

ఇది నందమూరి కుటుంబం నిజాయితీ

This is the honesty of the Nandamuri family

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు నందమూరి చైతన్య కృష్ణ. సీనియర్ ఎన్టీఆర్ గారి పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ గారి అబ్బాయి. చైతన్య కృష్ణ నందిగామ నుంచి విజయవాడ వస్తుంటే కృష్ణలంక దగ్గర కారు పంక్చర్ అయింది. మామూలుగా ఈ రోజుల్లో ఎంపీటీసీ కొడుకులు కూడా తమ కారు పంక్చర్ పడితే, వేరే వాళ్ళకు ఫోన్ చేసి కారు తెప్పించుకుని వెళ్లారు. లేదా, తన కారును డ్రైవర్‌కి వదిలేసి వెళ్తారు. నందమూరి చైతన్య కృష్ణ కూడా విజయవాడలోని ఏ టీడీపీ లీడర్‌కు ఫోన్ చేసినా ఐదు నిముషాల్లో కారు పంపిస్తారు. కానీ, చైతన్య కృష్ణ రక్తంలోనే ఆ గర్వం లేదు కదా.

అందుకే, తాను ప్రయాణించే కారును తానే స్వయంగా తీసుకుని వచ్చి పంక్చర్ వేయించుకున్నారు. రోడ్డు మీద నిలబడి ఒక సాధారణ వ్యక్తిలా తన కారును రిపేర్ చేయించుకున్నారు. ఇది ఏదో గొప్ప విషయం అని చెప్పడం లేదు, గొప్ప కుటుంబంలో పుట్టినా ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా తన పని తానే చేసుకుంటున్న వ్యక్తి గురించి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. నిజానికి నందమూరి చైతన్య కృష్ణ టిడిపి కార్యకర్తలకు, అలాగే నందమూరి అభిమానులకు కూడా చాలా మందికి తెలీదు. అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే వ్యక్తి.

సొంత తాత, మేనత్త భర్త రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా చరిత్రలు సృష్టించారు. అయినా కూడా చైతన్య కృష్ణ లో కాస్తైనా గర్వం లేదు. రోడ్డు పక్కన వెళ్లే ఓ వ్యక్తి వెళ్లి పలకరిస్తే.. కారు పంక్చర్ పడిందండి’ అని గౌరవంగా సమాధానం చెప్పారు. ఈ రోజుల్లో ఇంట్లో ఒకరు రాజకీయ నాయకులైతే చాలు, ఆ కుటుంబం మొత్తం కోట్లు సంపాదించి ఖరీదైన కార్లలో తిరుగుతుంది. అసలు తెలుగు రాష్ట్రాల రాజకీయ దిశను దశను మార్చిన కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి మాత్రం ఓ సాధారణ కారులో తిరిగుతున్నారు. ఇది నందమూరి కుటుంబం నిజాయితీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!