HomeTelugu Big Storiesటిల్లు స్కైర్‌: ఆకట్టుకుంటున్న'టిక్కెట్టే కొనకుండా.." సాంగ్‌

టిల్లు స్కైర్‌: ఆకట్టుకుంటున్న’టిక్కెట్టే కొనకుండా..” సాంగ్‌

Ticket Eh Konakunda Lyrical
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’. యూత్ ని బాగా ఆకట్టుకుంది. గతఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ వసూళ్లను నమోదు చేసింది. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వైర్’ రూపొందుతోంది. నాగవంశీ – సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ‘టిక్కెట్టే కొనకుండా .. ‘ అనే ఫుల్ సాంగును రిలీజ్ చేశారు. ‘టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా .. సిట్టి నీది సినుగుతుందేమో సూడరబుల్లోడా’ అంటూ ఈ పాట సాగుతోంది. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూర్చడమే కాకుండా, ఆయనే స్వయంగా ఆలాపించిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ‘డీజే టిల్లు’ సినిమాను చాలావరకూ ఆ సినిమా టైటిల్ సాంగ్ నిలబెట్టేసింది. అందువలన సంగీతం పరంగా సీక్వెల్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు. సీక్వెల్ పై యూత్ లో ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu