పవన్ ఆడియోకు గెస్ట్ ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘అజ్ఞాతవాసి’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ అవనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఆడియో ఈ నెల 19న నోవాటెల్ లో రిలీజ్ కానుందట. ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ ముఖ్య అతిథిగా వస్తున్నారని టాక్. 

ఓ పక్క సినిమాలే కాదు పాలిటిక్స్ లో కూడా జనసేన నిర్మించి 2019 ఎన్నికల్లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్. ఈమధ్యనే తన అన్న మీద ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అంతేకాదు పక్కన ఉన్న వ్యక్తుల వల్ల పీఆర్పికి నష్టం కలిగిందని అన్నారు. అన్నయ్య మీద ప్రేమను చూపిస్తున్న పవన్ ఈసారి ఇద్దరు కలిసి అటెండ్ అవుతున్న ఈ వేడుకలో ఏం మాట్లాడతారు అన్న విషయం మీద అందరి దృష్టి ఉంది.