HomeTelugu Trendingకరోనాతో..నటుడు కోసూరి వేణు గోపాల్‌ మృతి

కరోనాతో..నటుడు కోసూరి వేణు గోపాల్‌ మృతి

Tollywood actor venugopal k
టాలీవుడ్‌ నటుడు కోసూరి వేణు గోపాల్‌ కరోనా నిన్న రాత్రి మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిడంతో నిన్న మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌ సీ ఐ లో మేనేజర్‌ గా పనిచేసి రిటైర్ అయ్యారు.

ఉద్యోగం చేస్తూనే సినిమాల మీద ఆసక్తితో ఆయన సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చింది. గత 26 ఏళ్ళగా సినిమాల్లో నటిస్తోన్న ఆయన ఎన్నో వందల సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేశారు. మర్యాద రామన్న సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu