టీఆర్‌ఎస్‌కి సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన కేసీఆర్‌కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విటర్‌లో అభినందనలు వెల్లువెత్తాయి. కృష్ణంరాజు, రామజోగయ్య శాస్త్రి, నాని, సుబ్బరాజు, సుధీర్‌వర్మ, బీవీఎస్‌ రవి, హరీశ్‌ శంకర్, రాజ్‌తరుణ్‌, సందీప్‌ కిషన్‌ తదితరులు ట్వీట్లు చేసిన వారిలో ఉన్నారు.

-కృష్ణంరాజు: చారిత్రాత్మక విజయం సాధించినందుకు శుభాకాంక్షలు కేసీఆర్‌. మీ ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు హ్యాట్సాఫ్‌. మీరు ఇలానే ఎదగాలని కోరుకుంటున్నా. దేవుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి.
-సందీప్‌ కిషన్: అద్భుత విజయం సాధించిన కేసీఆర్‌, కేటీఆర్‌కు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మారు.
-నాని: సోదరుడు కేటీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు వారి పాత్రను నిర్వహించారు.. ఇక అద్భుతమైన భవిష్యత్తు కోసం మీరు పనిచేస్తారని మాకు తెలుసు.
-రామజోగయ్య శాస్త్రి: కేసీఆర్‌, కేటీఆర్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ విజన్‌, కృషి విజయాన్ని అందించాయి. క్లీన్‌ స్వీప్‌కు మీరు అర్హులు. మరో ఐదు సంవత్సరాలు భద్రంగా మీ చేతుల్లో ఉన్నాయి.
-రామ్‌: కేసీఆర్‌ గారికి, కేటీఆర్‌ గారికి అభినందనలు. మీ ఆత్మవిశ్వాసం అద్భుతం. మీకు దక్కాల్సిన విజయమే ఇది. మీరు చేపట్టనున్న మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నాం.
-సుబ్బరాజ్‌: టీఆర్‌ఎస్‌ పార్టీకి శుభాకాంక్షలు. మీ నాయకత్వం, అంకితభావం తెలంగాణ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్నాయి.
-సుధీర్‌వర్మ: కేసీఆర్‌ వ్యూహం అద్భుతం కేటీఆర్‌ సర్‌.
-రాజ్‌తరుణ్‌: క్లీన్‌ స్వీప్‌.. టీఆర్‌ఎస్‌ అద్భుతమైన మెజార్టీతో గెలుపొందింది. శుభాకాంక్షలు కేటీఆర్‌ గారు.
-మంచు లక్ష్మి: తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్‌ మరోసారి అధికారం దక్కించుకుంది.. ప్రజల హృదయాల్ని గెలుచుకుంది. కేటీఆర్‌, కేసీఆర్‌కు శుభాకాంక్షలు. మీ పాలనలో మరో ఐదేళ్లు తెలంగాణ ఎలా ఉండబోతోందో చూడాలని ఉంది.