HomeTelugu Trending'తూనీగా.. తూనీగా' బాలనటి సుహాని పెళ్లి ఫొటోలు వైరల్‌

‘తూనీగా.. తూనీగా’ బాలనటి సుహాని పెళ్లి ఫొటోలు వైరల్‌

Tollywood child actress su
టాలీవుడ్‌లో ‘మనసంతా నువ్వే’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ మూవీలో.. ‘తూనీగా.. తూనీగా’ పాటలో నటించిన సుహాని కలిత తాజాగా వివాహం చేసుకుంది. ఢిల్లీకి చెందిన సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాను పెళ్లాడింది. ‘యువర్స్ ఈవెంట్‌ఫుల్లీ’ అనే కంపెనీకి విభర్ సీఈవో అని సమాచారం. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. సుహాని పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సుహాని బాలనటిగా బాల రామాయణం, గణేశ్, ప్రేమంటే ఇదేరా, ఎదురులేని మనిషి, ఎలా చెప్పను.. తదితర సినిమాల్లో నటించింది. 2008లో ‘సవాల్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘స్నేహగీతం’ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu