HomeTelugu Newsఅజిత్‌కు విలన్‌గా టాలీవుడ్‌ హీరోలు!

అజిత్‌కు విలన్‌గా టాలీవుడ్‌ హీరోలు!

4 16
హీరో అజిత్ వరుసగా సినిమాలు చేస్తూ.. విజయాలను ఆయన ఖాతాలో వేసుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా ‘వాలిమై’ రూపొందుతోంది. బోనీ కపూర్ నిర్మాణంలో వినోత్ దర్శకత్వం వ్యహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్‌ జరుపుకుంది. త్వరలో విలన్ కాంబినేషన్లో సీన్లు చేయవలసి ఉందట.

విలన్ పాత్ర కోసం తెలుగు నుంచి యంగ్ హీరోలను తీసుకోవాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఉన్నారట. ఈ నేపథ్యంలోనే తెలుగులో కార్తికేయ పేరు వినిపించింది. తాజాగా నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. ఇద్దరికీ కూడా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేసిన అనుభవం వుంది. అజిత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ ఇద్దరిలో విలన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి మరి. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. హుమా ఖురేషి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu