HomeTelugu Big Storiesక్రిస్మస్‌ వేడుకల్లో టాలీవుడ్‌ స్టార్స్‌

క్రిస్మస్‌ వేడుకల్లో టాలీవుడ్‌ స్టార్స్‌

Tollywood Heroes Christmas
దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రైస్తవులు మాత్రమే కాకుండా హిందువులు కూడా ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు అభిమనులకు, ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్‌ మ్యాజిక్‌‌ మన జీవితాల్లో ఆనందాన్ని, చిరునవ్వును నింపుతుందని ఆశిద్దాం. ఈ పండుగ హాలీడే సీజన్‌ మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని కోరుకుంటున్నా’. అని ట్వీట్‌ చేశారు.

మహేష్‌ బాబు కూడా తన పిల్లలు క్రిస్మస్ ట్రీ వద్ద దిగిన ఫొటోను ఆయన పోస్ట్ చేశాడు. అందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ శాంతి, ప్రేమ, సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపాడు. ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. మరికొందరు టాలీవుడ్ హీరోలు కూడా ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

Tollywood Heroes

Recent Articles English

Gallery

Recent Articles Telugu