HomeTelugu TrendingTop 10 Tollywood Heroes: లేటెస్ట్‌ సర్వే.. ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారో తెలుసా?

Top 10 Tollywood Heroes: లేటెస్ట్‌ సర్వే.. ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారో తెలుసా?

Top 10 Tollywood HeroesTop 10 Tollywood Heroes: టాలీవుడ్‌లో ట్రెండ్‌ మారిపోయింది. ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరంటే ఎన్టీఆర్, చిరంజీవి. కానీ ఇప్పుడు అరడజనుకు పైగా పెద్ద హీరోలు ఉన్నారు. పలువురు హీరోలు టాప్ 10లో ఉన్నారు.

వీరిలో నెంబర్ వన్ ఎవరు? టాప్ 5 ఎవరు ఉన్నారు అనేది.. ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ తేల్చి చెప్పేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అభిప్రాయాలు సేకరించి టాలీవుడ్ టాప్ 10 హీరోలును వెల్లడించింది.

Top 10 Tollywood Heroes 1 Top 10 Tollywood Heroes,Mahesh,Allu Arjun,NTR,Ram Charan,Chiranjeevi,Pawan Kalyan,Prabhas

బాహుబలి చిత్రాలతో ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా ఈ సర్వే తేల్చింది. ఈ సినిమా ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. ఈ మూవీ తరువాత ప్రభాస్‌ బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్టార్‌ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన సలార్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన ప్రభాస్ ఫస్ట్‌ప్లేస్‌ దక్కించుకున్నాడు.

Top 10 Tollywood Heroes 2 Top 10 Tollywood Heroes,Mahesh,Allu Arjun,NTR,Ram Charan,Chiranjeevi,Pawan Kalyan,Prabhas

ఇక రెండో స్థానం సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఉన్నారు. ఇప్పటి వరకూ మహేష్‌ ఒక్క పాన్ ఇండియా మూవీ చేయనప్పటికీ పాపులారిటీలో సత్తా చాటుతున్నాడు. త్వరలో రాజామౌళి డైరెక్షన్‌లో ఓ పాన్‌ ఇండియా మూవీ చేయ్యనున్నాడు. ఈ సినిమాతో మహేష్‌కి మరింత క్రేజ్‌ పెరుగనుంది. ఈ కాంబినేషన్‌ కోసం మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

Top 10 Tollywood Heroes 3 Top 10 Tollywood Heroes,Mahesh,Allu Arjun,NTR,Ram Charan,Chiranjeevi,Pawan Kalyan,Prabhas

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మూడో స్థానంలో ఉన్నారు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారాడు అల్లు అర్జున్‌. ఈ సినిమా తరువాత పలు అవార్డులు కూడా అందుకున్నాడు. బాలీవుడ్‌, మాలీవుడ్‌ల్లో కూడా అల్లు అర్జున్‌ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. సోషల్‌ మీడియాలో కూడా బన్నీకి మంచి ఫాలోయింగే ఉంది. ప్రస్తుతం ఆయన పుష్ప 2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Top 10 Tollywood Heroes 4 Top 10 Tollywood Heroes,Mahesh,Allu Arjun,NTR,Ram Charan,Chiranjeevi,Pawan Kalyan,Prabhas

ఇక నాలుగులో స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. ‘ఆర్‌ఆర్ఆర్’ మూవీతో దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాకి గాను పలు అవార్డులను అందుకున్నాడు. ఈ సినిమా తరువాత దేవర సినిమా చేస్తున్నాడు. ప్రతిష్టత్మకంగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాపై భారీ హైప్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ స్ట్రెయిట్ హిందీ మూవీ వార్‌లో కూడా నటిస్తున్నాడు. దీనితో పాటు మరో సినిమా ఛాన్స్‌ కూడా లైన్‌లో ఉంది అని టాక్‌.

Top 10 Tollywood Heroes 5 Top 10 Tollywood Heroes,Mahesh,Allu Arjun,NTR,Ram Charan,Chiranjeevi,Pawan Kalyan,Prabhas
గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ టాప్ ఫైవ్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్‌చరణ్‌కు మంచిఫాలోయింగ్‌ వచ్చింది. ఈ సినిమాకి రామ్‌చరణ్‌ పలు అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ దాదాపు పూర్తి కావొస్తుంది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం చరణ్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Top 10 Tollywood Heroes 6 Top 10 Tollywood Heroes,Mahesh,Allu Arjun,NTR,Ram Charan,Chiranjeevi,Pawan Kalyan,Prabhas
ఆరోస్థానంలో పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాలు విషయానికి వస్తే.. ఓజీ చేస్తున్నాడు. సుజీత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కొంచెం మిగిలి ఉంది. ఎలక్షన్స్‌ తరువాత పవన్‌ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్ననున్నాడు. వీటితో పాటు పలు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

Tollywood Tier 5 Top 10 Tollywood Heroes,Mahesh,Allu Arjun,NTR,Ram Charan,Chiranjeevi,Pawan Kalyan,Prabhas

ఏడవ స్థానంలో నేచురల్‌ స్టార్‌ నాని ఉన్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నాని సినిమా బాగా కనెక్ట్‌ అవుతాడు. దసరా సినిమాతో మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. ఇటీవలే ‘హాయ్‌ నాన్న’ మూవీకి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఎనిమిదవ స్థానంలో రవితేజ ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ తాజాగా నటించిన చిత్రం ఈగల్‌. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూళ్లు సాధించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం రూ.50 కోట్లకి పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది.

Vijay Devarakonda Top 10 Tollywood Heroes,Mahesh,Allu Arjun,NTR,Ram Charan,Chiranjeevi,Pawan Kalyan,Prabhas

విజయ్ దేవరకొండకు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు. టాలీవుడ్‌ అర్జున్‌ రెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విజయ్‌.. యూత్‌లో మంచి క్రేజ్‌ని తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లో లైగర్‌ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే తెలుగులో ఫ్యామిలీ స్టార్‌ మూవీ చేసాడు.

Top 10 Tollywood Heroes 7 Top 10 Tollywood Heroes,Mahesh,Allu Arjun,NTR,Ram Charan,Chiranjeevi,Pawan Kalyan,Prabhas

పదవ స్థానంలో మెగాస్టార్‌ చిరంజీవి నిలిచాడు. టాలీవుడ్‌లో చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీ ఎంట్రీ తరువాత చిరంజీవి.. వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu