త్రిష రియాక్ట్ అయింది!

అటు తమిళంలో ఇటు తెలుగు ఇందుస్ట్రీల్లో ఇప్పుడు సుచి లీక్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ధనుష్ తో మొదలుపెట్టిన ఈ లీక్స్ పరంపర చాలా మందికి పాకింది. తమిళ ఇండస్ట్రీలో దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. రానా, త్రిష, అనిరుధ్, ఆండ్రియా ఇలా చాలా మంది నటీనటుల సీక్రెట్ ఫోటోలను లీక్ చేసింది. తాజాగా ఈ విషయంపై త్రిష స్పందించింది. ‘పగ తీర్చుకోవాలని
అనుకోనక్కరలేదు. కూర్చొని విశ్రాంతిగా చూస్తూ ఉండండి. మనను బాధ పెట్టిన వాళ్లు వారంతట వారే నాశనం అయిపోతారు. భగవంతుడి దయ వుంటే వారి నాశనం మనం కళ్లారా చూడొచ్చు’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది త్రిష. ఈ విషయంపై ఆమె తప్ప మరెవరూ రియాక్ట్ కాలేదు. కర్మ పేరుతో త్రిష మాత్రమే పైవిధంగా వెల్లడించింది.