HomeTelugu Big Storiesఇంగ్లాండ్‌దే ప్రపంచకప్‌

ఇంగ్లాండ్‌దే ప్రపంచకప్‌

2 14ఇంగ్లండ్‌ జట్టు అనుకున్నది సాధించింది. దశాబ్దాల కలను నెరవేర్చకుంది. ఎట్టకేలకు జగజ్జేతగా నిలిచింది. ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో అదృష్టం కూడా తోడవడంతో ఇంగ్లండ్‌ సగర్వంగా కప్‌ను ముద్దాడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు మాత్రమే చేయగలిగింది. 29 పరుగల వద్ద మార్టిన్‌ గప్టిల్‌ 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. నికోల్స్ 55, లాథమ్ 47, విలియమ్సన్‌ 30 పరుగులు మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోవడంతో 241 పరుగులకే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పరిమితమైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌, ప్లంకెట్ చేరో 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా.. వుడ్, ఆర్కర్‌ తలో వికెట్ తీశారు.

242 పరుగల టార్గెట్‌తో బరిలోకి దిగన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. సూపర్‌ డూపర్‌ ఫామ్‌లో ఉన్న రాయ్‌ (17), జో రూట్‌ (7), బెయిర్‌స్టో (36), మోర్గాన్‌ (9) తక్కువ పరుగలకు అవుటవడంతో 86/4తో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. ఈ దశలో బట్లర్‌, స్టోక్స్‌ ఐదో వికెట్‌కు 110 పరుగులు జోడించి విజయం దిశగా జట్టును తీసుకెళ్లారు. విజయానికి కావాల్సిన పరుగులు పెరిగిపోతుండడంతో బట్లర్‌ (59; 60 బంతుల్లో 6×4) భారీ షాట్‌కు యత్నంచి అవుటయ్యాడు. వోక్స్‌ (2) కూడా సిక్సర్‌కు ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు. ప్లంకెట్‌ 10 బంతుల్లో 10 విలువైన పరుగులు చేసి అవుటయ్యాడు. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్‌కు 15 పరుగులు అవసరంకాగా సరిగ్గా 15 పరుగులో చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. స్టోక్స్‌ (84; 98 బంతుల్లో 5×4, 2×6) నాటౌట్‌గా మిగిలాడు.

మ్యాచ్‌ టైగా ముగియడంతో సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. ఈ ఓవర్లో ఇంగ్లండ్‌ తొలి బ్యాటింగ్‌ చేసి 15 పరుగులు చేసింది. 6 బంతుల్లో 16 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 15 పరుగులే చేయగలిగింది. దీంతో మ్యాచ్‌ మళ్లీ టైగా మారింది. ఐతే.. ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టుదే విజయం అనే ఐసీసీ సూపర్‌ ఓవర్‌ నిబంధన ప్రకారం ఇంగ్లండ్‌ జట్టును విజేతగా ప్రకటించారు అంపైర్లు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu