HomeTelugu Trendingత్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌..

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌..

10 17
డైరెక్టర్‌ ‘త్రివిక్రమ్‌’ శ్రీనివాస్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి హిట్‌ను సంపాదించిన విషయం తెలిసిందే. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న తారక్‌కు ఈ సినిమా మరింత ఫాలోయింగ్‌ను తీసుకు వచ్చింది. అయితే ఈ వేసవిలో మరోసారి వీరు జతకడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన హ్యట్రిక్‌ మూవీ ‘అల వైకుంఠపురములో’ సైతం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, అలియాభట్‌, ఒలియా ముఖ్యప్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu