HomeTelugu Trendingఓటీటీలో 'టక్‌ జగదీశ్'‌..!

ఓటీటీలో ‘టక్‌ జగదీశ్’‌..!

Tuck jagadish release on OT
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టక్‌ జగదీశ్‌’. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతోంది. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే, కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడిప్పుడే థియేటర్లు పునఃప్రారంభం అవుతున్న తరుణంలో ‘టక్‌జగదీశ్‌’ రిలీజ్‌ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదలపై పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

త్వరలోనే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుందని సమాచారం. ఇందుకోసం చిత్రబృందానికి అమెజాన్‌ ప్రైమ్‌ భారీగానే డబ్బు చెల్లించిందట. అయితే, ఓటీటీ విడుదల విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. రీతూవర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఐశ్వర్యా రాజేశ్‌ రెండో హీరోయిన్‌గా నటిస్తుంది. జగపతిబాబు, నాజర్‌, రోహిణి, నరేశ్‌, రావు రమేష్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu