HomeTelugu Trending‘టక్‌ జగదీష్‌’ ట్రైలర్‌

‘టక్‌ జగదీష్‌’ ట్రైలర్‌

Tuck Jagadish Trailer

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న యాక్షన్‌, కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది.

ఈ ట్రైలర్‌ యాక్షన్‌, భావోద్వేగ సన్నివేశాలతో విశేషంగా ఆకట్టుకుంటుంది. ‘నిన్నుకోరి’ తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. ఈ సినిమాలో నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌, రోహిణి కీలకపాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించారు. ఏప్రిల్‌లోనే సందడి చేయాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ ముగిశాక థియేటర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఓటీటీకే మొగ్గుచూపారు నిర్మాతలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu