HomeTelugu Big Storiesవచ్చే సంక్రాంతికి అప్పుడే కర్ఛీప్‌ వేసిన 2 సినిమాలు

వచ్చే సంక్రాంతికి అప్పుడే కర్ఛీప్‌ వేసిన 2 సినిమాలు

Two movies release dateటాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి పలు సినిమాలు సందడి చేశాయి. వాటిలో గుంటూరు కారం, హనుమాన్‌, సైంధవ్‌, నా సామిరంగ థియేటర్లలో సందడి చేశాయి. ఇవన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం మహేష్‌ ఫ్యాన్స్‌ని ఫుల్‌ ఖుషీ చేసింది. ఇక ఈ సినిమాల మధ్య థియేటర్ల కోసం గట్టి పోటీనే జరిగింది.

గుంటూరు కారం సినిమాకి తప్ప మిగిలిన సినిమాలకు సరైన థియేటర్లు దొరకలేదు. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతికి ముందుగానే సీట్లు బుక్‌ చేసుకుంటున్నాయి పలు సినిమాలు. ఏడాది ముందుగానే 2 సినిమాల రిలీజ్‌ డేట్‌లను ప్రకటించారు.

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో విడుదల చేసారు. దీనితో పాటు పనిలో పనిగా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

Two movies1

ఈక్రమంలోనే దిల్‌రాజ్‌ మరో సూపర్‌హిట్‌ మూవీ ‘శతమానంభవతి’ సీక్వెల్స్‌ను కూడా ప్రకటించాడు. గతంలో ఈ సినిమా పలు పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించింది. పైగా దిల్‌రాజ్‌కు జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది.

సంక్రాంతి పండగ చుట్టూ ఫ్యామిలీ బంధాలు, ఎమోషన్స్ తో అల్లుకున్న పల్లెటూరు కథ ఇది. శర్వానంద్‌- అనుపమ హీరోహీరోయన్‌లుగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులును బాగా ఆకట్టుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా సీక్వెల్ ‘శతమానంభవతి నెక్ట్స్‌ పేజీ’ ఫిక్స్‌ చేశారు.

ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాలు వచ్చే సంక్రాంతికి అఫిషియల్‌గా డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాయి. ఇక ఈ రేసులో మరిన్ని సినిమాలు చేరే అవకాశం ఉంది. వాటిలో నాగార్జున బంగార్రాజు-3, హనుమాన్ సీక్వెల్స్‌ మరియు బాలయ్య కూడా ఈ రేసులో చేరే అవకాశం ఉంది. దీన్నిబట్టి చూస్తే వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu