తమ్ముడు కోసం బాబాయ్ ని త్యాగం చేసిన త్యాగమూర్తిరా జగనన్న !

నేనేంటో ప్రజలకు తెలుసు అంటున్నాడు వైఎస్ అవినాష్. అదే జగన్ రెడ్డి గోరి ముద్దుల తమ్ముడు. ఫాపం ఈ దూరపు తమ్ముడు కోసం దగ్గర బాబాయ్ ని కూడా త్యాగం చేసిన త్యాగమూర్తి మన మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఐతే. జగన్ గోరు తన బాబాయ్ త్యాగం చెయ్యొచ్చు, కానీ సీబీఐ మాత్రం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. ఎంతైనా హత్య కాబడిన వ్యక్తి మాజీ మంత్రి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు. అన్నింటికి మించి వివేకానంద‌రెడ్డికి మంచి మనిషి అని పేరు ఉంది. అలాంటి హ‌త్యని అతి దారుణంగా చంపారు.

అయినా, వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసును జగన్ రెడ్డి తప్పు ద్రోవ పట్టిస్తున్నాడు అని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ హత్య కేసులో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ నోటీసుల‌పై స్పందించారు క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. త‌న‌కు సీబీఐ అధికారులు నిన్న నోటీసులు ఇచ్చార‌ని.. అయితే ముందుగా నిర్ణ‌యించుకున్న కార్య‌క్ర‌మాలు ఉండ‌టం వ‌ల్ల విచార‌ణకు హాజ‌రు కాలేద‌ని.. ఐదు రోజులు త‌ర్వాత ఎప్పుడు విచార‌ణ‌కు పిలిచిన హాజరవుతానని తెలిపారు.

అదేమిటి ?, ఐదు రోజులు త‌ర్వాత ?, పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళలేదు ?, ఎందుకు అంటే లాయర్లతో చర్చించి.. సీబీఐ అధికారులకు ఎలా సమాధానాలు చెప్పాలి ?, ఏ విధంగా వారిని నమ్మించాలి ? లాంటి వ్యవహారాల పై మన జగన్ రెడ్డి గోరు శిక్షణ ఇస్తారు. ఎందుకంటే.. ఇలాంటి వ్యవహారాల్లో జగనన్న సీనియర్ కదా. అన్నట్టు ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాసేపు జీవించారు. తన ఎమోషనల్ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఆ ముచ్చట్లు ఏమిటో అవినాష్ రెడ్డి మాటల్లోనే విందాం.

‘గ‌త రెండు సంవ‌త్స‌రాల నుండి నాతో పాటు నా కుటుంబాన్ని ఓ వ‌ర్గం మీడియా అస‌త్య‌పు ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని.. నేనేంటో నా వ్యవహార శైలి ఏంటో ఈ జిల్లా ప్రజలకు బాగా తెలుసని చెప్పుకొచ్చారు. నిజమే అవినాష్ రెడ్డి ఏమిటో ?, ఆయన వ్యవహార శైలి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. అందుకే, ఆయన గారికి సీబీఐ అధికారులు హత్య కేసులో నోటీసులు ఇచ్చారు. అన్నట్టు ఇక్కడ ఒక ముక్క మర్చిపోయాం అండి. మన అవినాష్ రెడ్డి గోరు ‘న్యాయం గెలవాలని.. వాస్తవాలు తేలాలని తాను కూడా భగవంతుడిని కోరుకుంటున్నాని చెప్పుకొచ్చారు. పాపం ఈ మాటలు విని ఆ భగవంతుడు కూడా ఆశ్చర్యపోతాడు.

ఏది ఏమైనా ఇక్కడ జగన్ రెడ్డిని చూసి చనిపోయిన వివేకా కూడా ఆత్మ రూపంలో షాక్ అవ్వాల్సిందే. మా అన్నయ్య వీడ్ని నటుడ్ని చేసి ఉంటే.. బాగుండేది అని వివేకా కూడా కచ్చితంగా అభిప్రాయ పడి ఉంటారు. జగన్ రెడ్డి గోరి అభినయం ఆ స్థాయిలో ఉంటుంది మరి. ఏది ఏమైనా బాబాయ్ ని త్యాగం చేసిన త్యాగమూర్తి మన జగనన్న అని ఆయనకి సానుభూతి వ్యక్తపర్చక తప్పదు. ఎందుకంటే… దాదాపు నాలుగున్న‌రేళ్లుగా బాబాయ్ హత్య కేసును శాతింప జేయడానికి జగనన్న తెగ కష్టపడుతున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates