HomeTelugu Big Storiesఅల్లరి నరేష్‌ 'ఉగ్రం' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అల్లరి నరేష్‌ ‘ఉగ్రం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Ugram Release Date Announce
అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. ఈ టైటిల్ కి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మిర్నా హీరోయిన్‌గా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ ని మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామని సోషల్ మీడియా వేదికగా హీరో అల్లరి నరేష్ సోమవారం ప్రకటించారు. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఓ వీడియోను విడుదల చేస్తూ క్రేజీ అప్ డేట్ ని అందించిన సర్‌ప్రైజ్ చేశారు. ఈ మూవీని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది.

రెడ్ కలర్ థీమ్ లో ఓ గ్లిమ్స్ ని విడుదల చేశారు. ఇందులో బుల్లెట్ పై వచ్చిన హీరో అల్లరి నరేష్ కోపంతో ఊగిపోతూ గన్ తీసి కాల్చడం.. అది రిలీజ్ డేట్ గా మారడం ఆకట్టుకుంటోంది. ఈ గ్లిమ్స్ కు శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం హైలైట్ గా నిలుస్తోంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీతో అల్లరి నరేష్ విజయ్ కనకమేడల ‘నాంది’ మ్యాజిక్ ని మరో సారి రిపీట్ చేస్తారో వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu