‘జై లవకుశ’ టీజర్ రాబోతుంది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన లభిస్తోంది. మూడు పాత్రల్లో ఒక పాత్ర లుక్ ను విడుదల చేయగా.. త్వరలోనే టీజర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. జులై మొదటి వారంలో అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. నందమూరి ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే జులై మొదటి వారానికి మరో విశేషం ఉంది. జులై 5న నందమూరి హీరో, ఈ చిత్రనిర్మాత కల్యాణ్ రామ్ పుట్టినరోజు.
కాబట్టి జులై 5న కల్యాణ్ రామ్ పుట్టినరోజు కానుకగా ఈ టీజర్ ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా నివేదా థామస్, రాశి ఖన్నాలు కనిపిస్తుండగా మరో ముఖ్య పాత్రలో నందిత కనిపించనుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.