HomeTelugu Big Stories'అన్ స్టాపబుల్-2' పవన్‌ ఎపిసోడ్‌-2 స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదల

‘అన్ స్టాపబుల్-2’ పవన్‌ ఎపిసోడ్‌-2 స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదల

Unstoppable POWER FINALE Pa
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్-2’. ఈ షో మంచి జోష్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ షోకి అతిథిలు గా విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వారం గెస్ట్ గా విచ్చేయగా ఆయన పాల్గొన్న ఎపిసోడ్ ని రెండు పార్టులు గా ప్రసారం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ప్రసారం అయిన మొదటి పార్టు కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించగా రెండవ పార్ట్ ని కూడా మరింత ఆసక్తికరంగా రెడీ చేసారు.

కాగా కొద్దిసేపటి క్రితం పార్టు 2 యొక్క స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. పవన్‌ సినిమాలు, రాజకీయ జీవితానికి సంబందించిన పలు అంశాలు కూడా పార్ట్ 2లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ రాబడుతోంది. కాగా పార్ట్ 2 ని ముందుగా ప్రకటించిన దానికంటే ఒకరోజు ముందే అనగా ఫిబ్రవరి 9న ప్రసారం చేయనున్నారు. కాగా ఈ పార్ట్ 2 ఈరోజు రాత్రి 9 గంటల నుండి ఆహా ఆడియన్స్ ముందుకి రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu