‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్టుగా బాలయయ!

అల్లు శిరీష్ హీరోగా .. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ధీరజ్ – విజయ్ నిర్మించిన ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమని .. సునీల్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates