‘ఉప్పెన’లా వస్తున్న వైష్ణవ్‌ తేజ్‌!

మెగా ఫ్యామీలి నుంచి వచ్చిన మరో యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా వైష్ణవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు ‘జాలరి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌ తెర మీదకు వచ్చింది. జాలర్ల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఉప్పెన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ టైటిల్‌ను చిత్ర నిర్మాతలు రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates