HomeTelugu Big Storiesఏప్రిల్‌ 30న ఓటీటీలో వకీల్‌సాబ్‌

ఏప్రిల్‌ 30న ఓటీటీలో వకీల్‌సాబ్‌

Vakeel saab in OTT on april
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన తాజా చిత్రం ‘వకీల్‌సాబ్’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఏప్రిల్‌ 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ రీమేక్‌గా శ్రీరామ్‌ వేణు ‘వకీల్‌సాబ్‌’ను తెరకెక్కించారు.

సత్యదేవ్‌గా లాయరు పాత్రలో అదరగొట్టారు పవన్ కల్యాణ్‌. ప్రకాశ్‌ రాజ్‌, అంజలి, నివేదా థామస్, అనన్య, శ్రుతి హాసన్‌ కీలక పాత్రలు పోషించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేశారు. దీంతో పవన్‌ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu