వరుణ్ ఖాళీగా బొమ్మలు గీస్తున్నాడట!

మీరు వింటున్నది నిజమే.. మెగాహీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటూ.. తన ఫోన్
లో బ్యాట్ మ్యాన్ బొమ్మలు, సెల్ఫీలతో కొత్త ప్రయోగాలు చేస్తున్నాడట. నిజానికి వరుణ్ ఇప్పుడు
రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనాల్సివుంది. అయితే ఇటీవల ఊటీలో ‘మిస్టర్’ సినిమా
షూటింగ్ లో తనకు యాక్సిడెంట్ కావడంతో డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు. ఇక చేసేదేమీ లేక
హైదరాబాద్ వచ్చేసిన వరుణ్ మంచానికే అతుక్కొని ఉంటున్నాడట. నడిచే పరిస్థితి లేకపోవడంతో
అలా బెడ్ మీద ఉండడం బోర్ కొడుతుందట. నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి అంటూ
అభిమానులకు తన బాధను తెలియజేస్తున్నాడు. వరుణ్ తొందరగా కోలుకొని షూటింగ్ లో
పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates