HomeTelugu Trendingవచ్చేనెల వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా స్టార్ట్‌

వచ్చేనెల వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా స్టార్ట్‌

4 17మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ విభిన్న కథలతో ముందుకెళుతున్నాడు. ‘ఎఫ్ 2’ .. ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలతో విజయాలను అందుకున్న వరుణ్ తేజ్.. తన తదుపరి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేయనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, వచ్చేనెల 17వ తేదీ నుంచి వైజాగ్ లో రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది.

అల్లు బాబీ – సిద్ధూ నిర్మిస్తున్న ఈ సినిమాకి, హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కనిపించనున్నాడు. కొన్ని నెలలుగా బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని మరీ, ఈ సినిమా షూటింగులో వరుణ్ తేజ్ పాల్గొననున్నాడు. హీరోయ విషయంలో క్లారిటీ రావలసి వుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu