HomeTelugu Big Storiesవరుణ్‌- లావణ్యల పెళ్ళి ఫోటోలు వైరల్‌

వరుణ్‌- లావణ్యల పెళ్ళి ఫోటోలు వైరల్‌

Varun tej Lavanya wedding

టాలీవుడ్‌ ప్రేమజంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీలో వీరి పెళ్లి వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరైయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Image

బుధ‌వారం రాత్రి వరుణ్ తేజ్-లావణ్య వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొత్త జంట అందరికీ నమస్కారం చేస్తున్న ఫొటోను నాగ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు సహా అందరూ కొత్త జంటను ఆశీర్వదించాలని కోరారు. వీటితో పాటు పెళ్లి మండపంలో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి ఫ్యాన్స్.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

398016335 881643546652271 314400621834739237 n.jpg?stp=dst jpg p526x296& nc cat=109&ccb=1 7& nc sid=5f2048& nc ohc=0gGgGUtngJsAX WeoSu& nc ht=scontent.fhyd11 3

పెళ్లికి పవన్ కల్యాణ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ సహా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. ఇక వీరి వివాహ విందు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే మెహందీ, హ‌ల్దీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇప్పుడు పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ విష్ చేస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu