HomeTelugu Trendingవరుణ్‌ తేజ్‌ 'యాక్షన్‌' మూవీ ప్రారంభం

వరుణ్‌ తేజ్‌ ‘యాక్షన్‌’ మూవీ ప్రారంభం

Varun tej praveen sattarus

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యాక్షన్‌’ ఒకటి. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన వీడియో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. కాగా తాజాగా చిత్రబృందం ఓ బిగ్‌ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ను లండన్‌లో ప్రారంభం చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇక వరుణ్ ఇటీవలే తన 13వ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏయిర్‌ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu