మెగా బ్రదర్స్‌ సెల్ఫీ

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి నిర్మిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో బిజీలో ఉన్నాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న చరణ్ రీసెంట్ గా తమ్ముడు వరుణ్ తేజ్ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అన్నదమ్ములు ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న వాల్మీకి సినిమా ఏప్రిల్ 16 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది. తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.